రాయదుర్గం పట్టణంలో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన, స్వామి వారి రథోత్సవం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శుక్రవారం ఉదయం శాంతినగర్ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెండి రథంపై అయ్యప్ప స్వామి ని ఊరేగిస్తూ రథోత్సవం నిర్వహించారు. బళ్లారి రోడ్డు, వినాయక సర్కిల్, ఓబుళాచారి రోడ్డు మీదుగా జరిగిన ఊరేగింపులో వందలాది మంది అయ్యప్ప మాలదారులు పాల్గొన్నారు.