ప్రకాశం జిల్లాలో ఆదివారం గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపాయి. రాచర్ల మండలం ఎడవల్లి గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి శివాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలకు ప్రయత్నించారు. ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహాన్ని పెకలించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఎంతో ప్రాచీన పురాణ దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు దేవాలయాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.