ప్రొద్దుటూరు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు:మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
Proddatur, YSR | Nov 26, 2025 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లక్ష సంతకాలు సేకరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు నివాసంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 96 వేల మంది సంతకాలు చేశారన్నారు. రేపు సాయింత్రం అమృతానగర్ నందు మరో 4 వేల మందితో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.