వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి లబ్ధిదారులకు ఇందిర మైండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని తాము వచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామన్నారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని ఆయన పిలుపునిచ్చారు.