పాములపాడు మండలం బానకచర్ల గ్రామంలో సుశీల అనే మహిళ రెండు రోజుల క్రితం అదృశ్యం. సమీపంలోని తెలుగంగ కాలువలో మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా పాములపాడు మండలం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బానకచర్ల గ్రామానికి చెందిన సుశీల అనే వివాహిత రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ లో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతురాలు సుశీలగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.