కొడంగల్: దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూ సర్వే
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి, లగచర్ల,హకింపేట్, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం స్థానిక తాసిల్దార్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో 99.27 ఎకరాల్లో భూ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.