భూపాలపల్లి: గిరిజన ఆశ్రమ పాఠశాల కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి : సిఐటియు జిల్లా అధ్యక్షులు సాయిలు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ముందు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు బతుకమ్మ ఆటాడి వినూత్న నిరసన తెలిపారు.ఈకార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయిలు మద్దతు తెలిపారుబిఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది రోజులుగా కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని, వెంటనే జీవో నెంబర్ 64 రద్దుచేసి, గేట్ సీ టు ప్రకారం కలెక్టర్ ఫండ్ నుంచి కార్మికులకు వేతనాలు చెల్లించాలని,కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది అన్నారు.