పెద్దపల్లి: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిరసన చేపట్టినవిశ్వహిందూ పరిషత్ బజరంగదళ్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వహిందూ పరిషత్ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విశ్వహిందూ పరిషత్ బజరంగదళ్ నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేరి నిరసన చేపట్టారు. అనంతరం పలువురు బజరంగ్దళ్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ బిల్లును నిరసిస్తూ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లకు దిగడంతో పాటు హిందువులను మూకుమ్మడిగా దాడి చేసి చంపడం జరుగుతుందని అన్నారు.