దుగ్గొండి: మల్లంపల్లి గ్రామంలో గల గౌడ కుల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు
దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో గల గౌడ కుల ఆరాధ్య దైవం రేణుక ఎల్లమ్మతల్లి, కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసుకున్న 4 గుడిగంటలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసారు. నాలుగు గుడిగంటల విలువ సుమారు.15 వేల పైబడి ఉంటాయని, గుడిగంటల దొంగతనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గౌడ కులస్తులు పోలీస్ వారిని కోరుతున్నారు.