ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : వంగాలపల్లి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ కిందపడి ఆటో డ్రైవర్ మృతి
చిలుపూర్ మండలం వంగాలపల్లి జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ కిందపడి ఆటో డ్రైవర్ శనివారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందాడు. హైదరాబాదు నుండి హన్మకొండ వైపు టీఎస్ 25 టి7575 నంబర్ కలిగిన ఆయిల్ ట్యాంకర్ వెళుతున్నది. ట్యాంకర్ కు ముందు టీఎస్ 27 టి ఏ 30 21 నంబర్ గల ఆటోను కొండూరు మురళి నడుపుతుండగావెనకాల వస్తున్న ట్యాంకర్ ఢీకొనగా ఆటో డ్రైవింగ్ చేస్తున్న మురళి కింద పడిపోయాడు. పక్కనుండి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కింద మురళి పడిపోవడంతో అతని తలపై నుండి ట్యాంకర్ టైర్లు ఎక్కడంతో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హన్మకొండ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.