మధిర: సాగర్ జలాలతో పైటలను కాపాడాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
సాగర్ జలాలతో చెరువులు నింపి పంటలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు.సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గ సమావేశం వీరయ్య అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ సమావేశంలో పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలని కోరారు. సాగరకు జలాలతో చెరువులన్నీ నింపాలని రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం మొక్కజొన్న మిర్చి పండ్ల తోటల రైతులు సాగర్ జలాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.