వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో తాగుబోతు వీరంగం... బస్సు అద్దాలను రాళ్లతో కొట్టడంతో బస్సు అద్దాలు ధ్వంసం
వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో తాగుబోతు వీరంగం సృష్టించారు. బస్సు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేయడంతో, బస్సులో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఆర్టీసీ సిబ్బంది అతనికి దేహశుద్ధి చేసి, వెలుగోడు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు, ఈ ఘటనపై వెలుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నట్టుండి రాళ్లతో దాడి చేయడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.