బద్వేల్: గోపవరం : సర్వే నెంబర్ 1557లోని 15 ఎకరాల భూమిని ఎన్టీఆర్ గృహాలకు కేటాయించాలని వినతి
Badvel, YSR | Jul 15, 2025 కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని గోపవరం మండలం సెంచరీ పరిశ్రమ పక్కనే ఉన్న 1557 సర్వేనెంబర్ లోని 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎన్టీఆర్ గృహాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు బద్వేల్ నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త రితేష్ రెడ్డిని కోరారు. బద్వేల్ పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వివరించారు.