అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో లారీకి పంచర్ వేస్తుండగా టైరు పగిలి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులోని జంగాల కాలనీలో నివాసం ఉండే ఖాజా పంచరు దుకాణం పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం తన దుకాణంలో లారీ టైరుకు పంచర్ వేస్తుండగా అకస్మాత్తుగా టైర్ పేలి ఖాజాపై పడి మొహం, తల, ముక్కుకు గాయాలయ్యాయి. ఖాజాను వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.