ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో డిసెంబర్ 29 సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసులు ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని నారాయణ పల్లి గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చింతలపల్లి విద్యుత్ పీడర్ పరిధిలోని హనుమంతరాయునిపల్లి, కసినపల్లి, ఓబులాపురం, గోహారపల్లి, వర్ధన పల్లి గ్రామాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.