గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలో పలు లాడ్జిలు తనిఖీలు నిర్వహించిన పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం లాడ్జిలను ఎస్సై కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గదులను అద్దెకిచ్చే సమయంలో గదులను అద్దెకు తీసుకునే వారి పూర్తి వివరాలను రిజిస్టర్లు సేకరించడంతోపాటు గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి గదులను అద్దెకు ఇస్తే కఠిన చర్యలు తప్పవని కోటేశ్వరరావు హెచ్చరించారు.