డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రభుత్వ అధికారులు కానీ దండ వేసి నివాళులర్పించలేదని ఆయన తెలిపారు.