ఉప్పల్: మల్లాపూర్ ప్రాంతానికి చెందిన రవి ప్రసాద్ కుటుంబాన్ని సత్కరించిన ఆర్మీ అధికారులు
శుక్రవారం రోజున ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ ప్రాంతానికి చెందిన ఆర్మీ అధికారి కుటుంబానికి ఘన సత్కారం,1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మల్లాపూరుకు చెందిన రవిప్రసాద్ కుటుంబానికి ఆర్మీ అధికారులు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించారు. కార్గిల్లోని మౌంటెన్ హెడ్క్వార్టర్కి చెందిన ఆర్మీ ప్రతినిధులు రవిప్రసాద్ కుటుంబానికి ప్రశంసా పత్రం, మెమెంటో అందజేసి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.రవిప్రసాద్ తమకు స్ఫూర్తిదాయకమని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.