తాసిల్దార్ శ్రీనివాసులు పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం తగదు, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ సి నాయకుల కోట ప్రభాకర్,జాన్ మాదిగ
నంద్యాల జిల్లా నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులు పై కొందరు కుట్ర పన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం దొంగ చాటున వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ దళిత ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సోమవారం నందికొట్కూరు పట్టణంలోని రబ్బానీ కాంప్లెక్స్ లో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో, ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నాయకులు కోటా ప్రభాకర్, జాన్ మాదిగలు డిమాండ్ చేశారు, అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ దళిత ఉద్యోగులపై అసత్య ప్రచారాలు చేయడం తగదని ప్రచారాలు మానుకోకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించ