నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురంలో వైసీపీ నాయకులు, అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి బుగ్గన, మాజీ సీఎం జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.