ప్రొద్దుటూరు: ఆదర్శ సమాజం ఏర్పాటు కోసం కృషి చేస్తాం
Proddatur, YSR | Nov 20, 2025 ఆదర్శ సమాజ ఏర్పాటుకు జమా అతె ఇస్లామీ హింద్ కృషి చేస్తోందని రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎన్ఎస్ మొహిద్దిన్ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని తమ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం'పొరుగు వారి హక్కులు' అనే నినాదంతో ఉద్యమ కరపత్రాలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు దేశవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. కరపత్రాలు, పోస్టర్లు ద్వారా ఇంటింటికి వెళ్లి పొరుగువారి హక్కులను ప్రజలకు వివరిస్తామన్నారు.