విజయనగరం: సృష్టికర్త, శిల్పకళా నిపుణులు విశ్వకర్మ అని కొనియాడిన విజయనగరం జేసీ సేతుమాధవన్
నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు సమాజంలో ఎల్లప్పుడూ విశేష గౌరవం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ పేర్కొన్నారు. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.బుధవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న జెసి ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచానికి సృష్టికర్త, శిల్పకళా నిపుణుడు, వాస్తుశాస్త్ర పితామహుడు గా గౌరవింపబడే విశ్వకర్మ మహర్షి స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అని పేర్కొన్నారు.