గంగాధర నెల్లూరు: ఎస్ ఆర్ పురం మండలం, డీకే మరి పల్లెలో గుడిసెకు నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
ఎస్ ఆర్ పురం మండలం, డీకే మరి పల్లెలో సోమవారం శోభ అనే మహిళ పూరిగుడిసెకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో గుడిసెలోని నిత్యవసర సరుకులు, బీరువాలో ఉన్న 30 వేల నగదు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.