రాయదుర్గం: పశువుల దొంగను పట్టుకుని బందించిన ఆర్. కొత్తపల్లి గ్రామస్తులు
గుమ్మగట్ట మండలంలోని ఆర్. కొత్తపల్లి గ్రామంలో పశువులు దొంలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు బందించారు. గ్రామ సమీపంలోని జనార్దన్ రెడ్డి తోటలో తాళ్లతో కట్టి ఉంచిన పాడి గేదెలను కర్ణాటక రాష్ట్రంలోని ముత్తుగేరిపల్లికి చెందిన పాలయ్య అనే వ్యక్తి అర్ధరాత్రి దాటిన తర్వాత గేదెలను తోలుకొని వెళ్లి రంగసముద్రం గ్రామంలో రైతుకు విక్రయించాడు. ఈ విషయాన్ని గమనించిన మరో రైతు ఆర్ కొత్తపల్లి గ్రామస్తులకు తెలిపారు. రంగసముద్రం గ్రామానికి చేరుకున్న రైతు జనార్దన్ రెడ్డి వాటిని చూసి గుర్తుపట్టాడు. పోలీసులు విచారిస్తున్నారు.