అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి హనిమరెడ్డిపల్లి గ్రామాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివ నారాయణ, కళ్యాణదుర్గం కె వి కే సమన్వయకర్త చండ్రాయుడులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి గురువారం సందర్శించారు. ఆయా గ్రామాల్లో వేరుశెనగ మరియు కంది పంటల క్షేత్ర పరిశీలన చేశారు. రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాదాయకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం నందు ఉన్న శాస్త్రవేత్తల ద్వారా రైతులు ఎప్పటికప్పుడు తమ ప్రశ్నలను నివృత్తి చేయించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.