దుబ్బాక: రహదారులపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు - దుబ్బాక సిఐ శ్రీనివాస్
రహదారులపై వరి ధాన్యం ఆరబోసే వారిపై చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం సిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాల్లో, ఇతర ఖాళీ ప్రాంతాల్లో ఆరబోయాలని, రహదారులపై ఆరబోయవద్దని సూచించారు. రహదారులపై ఆరబోసిన ధాన్యంపై ప్లాస్టిక్ సంచులు, బండ రాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై వస్తున్న వాహనదారులు తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురవడం, కొంత మంది యువకులు ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు.