నంద్యాల జిల్లా డోన్‌లోని శిర్డీ సాయి దేవాలయం సమీపంలో ఉన్న ప్రహరీని కూల్చారంటూ ఇటీవల లేవనెత్తిన ఆరోపణలపై ల్యాండ్ ఓనర్లు, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ టీఈ కేశన్న గౌడ్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కొంతమంది తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ వద్ద ఉన్న భూ పత్రాలు, అనుమతులు అన్నీ చట్టబద్ధమైనవేనని అన్నారు. అవసరమైతే అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.