ధర్మపురి: నేరెళ్లలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
ధర్మపురి మండలంలోనీ నేరేళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాని గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా తమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంనికి స్థలం ఏర్పాటు చేయాలని రైతులు నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని అధికారులను సూచించారు.