ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలోని ప్రజలకు సీఐ అజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగ వస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఊర్లకు వెళ్లేటట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇండ్లకు తాళాలు వేసిన వాటిని టార్గెట్గా చేసుకొని గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడుతున్నట్లు గుర్తు చేశారు. పోలీసుల సూచనలను పాటించి దొంగతనాలను నివారించడానికి సహకరించాలని ప్రజలను కోరారు.