కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కిటకిటలాడిన శివాలయాలు.పుట్టపర్తిలో కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం సాయంత్రం శివాలయాలకు భక్తులు పోటెత్తారు. సత్యమ్మ ఆలయం వద్ద ఉన్న శివాలయం ఎనుములపల్లిలోని శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎనుములపల్లిలో శివలింగాన్ని పూజారులు వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు భారీ ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు కార్తీకదీపం వెలిగించి శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు