రాజంపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : జిల్లా సాధన కమిటీ
రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలని నిరసన రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ మాటలు నిలబెట్టుకునేలా ఆయనకు మంచి మనసు ప్రసాదించమని జేఏసీ నేతలు భక్తకన్నప్పను వేడుకున్నారు. ఆదివారం రాజంపేట మండలం ఊటుకూరులోని భక్తకన్నప్ప విగ్రహం వద్ద జిల్లా కేంద్రం కోసం నినాదాలు చేశారు.వారు మాట్లాడుతూ అందరికీ సౌకర్యం అయిన,అందుబాటులో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కోరారు.