అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్ లో భర్త వేధింపులను తాళలేక ఉరవకొండ ఖైరున్ బి అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో త్రీ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.