శ్రీరంగాపూర్: శ్రీరంగాపురం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య సమస్యలపై సమీక్షా సమావేశం
శ్రీరంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రాముడు ఆధ్వర్యంలో ఎన్ సి డి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎన్సిడి రీస్క్రీనింగ్, ఫాలో అప్స్, అభా కార్డ్స్ , ఈ సంజీవిని కాల్స్, టెలి మానస్ కాల్స్, ఎల్డర్లి కేర్, పాలియెటివ్ కేర్, , ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు నిర్వహించే కార్యక్రమాల గురించి కూలంకషంగా రివ్యూ నిర్వహించారు. అన్నింటిని లక్ష్యానికి అనుగుణంగా ఇంప్రూవ్ చేయాలని డాక్టర్ సూచించడం జరిగింది. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఆశ వర్కర్లు ఆరోగ్య సిబ్బంది అంచనాలు వేస్తూ నివారణ చర్యలు చేపట్టాలని