కాగజ్నగర్: భట్పల్లి-అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బురద నీటిలో నిరసన తెలిపిన విద్యార్థినిలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం భట్పల్లి - అందవెల్లి గ్రామాల మధ్య రోడ్డు పై ఏర్పడిన గుంతలలో నిండిన బురద నీటిలో నిలబడి విద్యార్ధినులు బుధవారం ఆందోళన చేపట్టారు. తాము పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బురద నీటిలో వెళ్ళడం కష్టం గా ఉందని పలు మార్లు అధికారులకు విన్నవించిన స్పందన లేదని వాపోయారు. అధికారులు, నాయకులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.