చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే వివరాల్లోకెళ్తే తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరిన లారీ కార్వేటి నగరం మండలం ఆర్కే విబిపేట వద్ద బోల్తా పడింది లారీ డ్రైవర్ను కాపాడేందుకు స్థానిక ఇందిరా కాలనీకి చెందిన రామలింగం గిరిబాబు అక్కడికి వెళ్లారు అదే సమయంలో తిరుపతి నుంచి పల్లిపట్టుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామలింగం గిరిబాబు మీదకు దూసుకుపోయింది రామలింగం చనిపోగా గిరిబాబు తిరుపతి రూరల్ చికిత్స పొందుతున్నాడు.