అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం శీర్పి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతు బసవరాజు స్వామి క్షేత్రంలో బుధవారం ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఎకాలజీ అధికారులు నిర్వహించారు. రసాయన మందులు పిచికారి చేయకుండా కేవలం జీవామృతం ఘనజీవామృతం వేపకషాయం పిచికారి ద్వారా పంటలను సాగు చేయు విధానాలపైన ఏ టీ ఎం మోడల్ ప్లాంటేషన్ పైన రైతులకు అధికారులు సీబీఓ కోఆర్డినేటర్ భాస్కర్ బాబు, అగ్రికల్చర్ స్పెషలిస్ట్ వీరభద్రారెడ్డి, ఎంటిఎల్ భవానిలు వివరించారు.