రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణమండపంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఉదయం ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రారంభమైన రక్తదానంలో వందలాది మంది యువకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చి రక్తాన్ని ఇచ్చారు. రక్తదాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు.