మేడిపల్లి: నూతన బ్రిడ్జిని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వల్లంపల్లి గ్రామంలోనీ కాకతీయ కెనాల్ పై 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోనీ కాకతీయ కెనాల్ పై 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి నీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభం చేశారు. సుదీర్ఘంగా వల్లంపల్లి ప్రజలు ఎదురుచూస్తున్న నూతన బ్రిడ్జి అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.నూతన రోడ్లు అందుబాటులోకి రావడం ఒక గ్రామంలో నుండి మరొక గ్రామానికి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు.