బద్వేల్: మానత్వం చాటుకున్న నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ రితేష్ రెడ్డి
Badvel, YSR | Jul 12, 2025 కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ రితేష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారని స్థానికులు తెలిపారు. శనివారం ఆయన ప్రయాణిస్తున్న మార్గమధ్యంలో సిద్ధ పేరంటాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించారు. వెంటనే ప్రమాదంలో గాయపడిన వారివద్దకు వెళ్లి, వివరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి అటువైపు వాహనాలు ఏమీ రాకపోవడంతో సొంత వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రోడ్డు ప్రమాదం ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.