అన్నదమ్ముల మద్య జరిగిన ఘర్షణలో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన రాయదుర్గం మండలంలోని బిఎన్ హళ్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు గ్రామానికి చెందిన రామాంజనేయులు, మహారాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఇంటిముందు మురుగునీరు విషయంలో గొడవపడ్డారు. ఈ గొడవలో మహరాజ్ గడ్డపార తీసుకుని రామాంజనేయులు తలపై వేయడంతో రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.