చింతకాని: ఈనెల 13న ఖమ్మం పట్టణంలోని టిజీఎస్ ఆర్టీసీ రీజియన్ మహాసభ ఏర్పాటు
టీజీఎస్ ఆర్టీసీ తెలంగాణ మద్దూర్ యూనియన్ ఖమ్మం రీజియన్ మహాసభ ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు యూనియన్ నాయకుడు గుర్రం శ్రీనివాస్ తెలిపారు. ఖమ్మంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే సభలో కార్మికుల సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. యూనియన్ కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు.