రాయదుర్గం పట్టణంలోని పశు వైద్య శాలను జిల్లా జాయింట్ డైరెక్టర్ ప్రేమ్ చంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం పశువుల ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పశువులకు సంబంధించిన ప్రతీ విషయం భారత్ పశు ధన్ యాప్ లో ఎప్పటిక్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. పశువుల్లో వచ్చే వ్యాదులు, వ్యాక్సినేషన్ చికిత్సలపై సమీక్షించారు. పాడి రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రానున్న వేసవిలో పశువులకు గ్రాసం, నీరు, ధానా సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.