తాడిపత్రి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా నివాసం ఉండే సాయికిరణ్ అనే వ్యక్తి శనివారం ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం సాయికిరణ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.