అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని గంగులకుంట గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పంటల బీమా వారోత్సవాలు కార్యక్రమంలో రాప్తాడు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కిష్టప్ప పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కిష్టప్ప మాట్లాడుతూ రైతులు వేసే ప్రతి పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని పంటలకు ప్రీమియం చెల్లించడం వల్ల పంట నష్టపోయినప్పుడు బీమా కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాయని., అందువల్ల ప్రతి రైతు పంట బీమా ప్రీమియం చెల్లించాలని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కిష్టప్ప పేర్కొన్నారు.