అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారం మూడున్నర గంటల సమయంలో జెఎన్టియు సెంట్రల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సురేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ సెంట్రల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సురేష్ బాబు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు ఏపీ ఆర్ సెట్ ఇంటర్వ్యూలు ముగియడం జరిగిందని, ఈ ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్డీ సీట్లు కేటాయించడం జరిగిందని మొత్తం 540 మంది ఇంటర్వ్యూకు హాజరు కావడం జరిగిందని జెఎన్టియు సెంట్రల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సురేష్ బాబు మీడియాకు వివరాలను వెల్లడించారు.