భూపాలపల్లి: ప్రజలకు వైద్యం అందించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గం లోని రేగొండ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమస్యలు మాట్లాడారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరరావు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి నిధులు కేటాయిస్తున్నామని, ప్రతి పేదవాడికి విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని,ఇప్పటికే జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం చేపట్టామని రానున్న రోజుల్లో మరింత మందిని చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు ఎమ్మెల్యే గండ్ర.