ఆలూరు: చిప్పగిరి ప్రాథమిక పాఠశాలలో డ్రాప్ అవుట్లు, తల్లిదండ్రులకు ఫోన్ చేసిన జిల్లా కలెక్టర్ సిరి
Alur, Kurnool | Dec 2, 2025 చిప్పగిరి ప్రాథమిక పాఠశాలలో డ్రాపవుట్లు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సిరి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులకు నేరుగా ఫోన్ చేసి కారణాలు తెలుసుకున్నారు. విద్య అందరికీ చేరేలా చూడటం ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి తిరిగి పాఠశాలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యా యులకు కలెక్టర్ ఆదేశించారు.