కుప్పం: కుప్పం : యోగా పోటీల్లో కుప్పం చిన్నారి ప్రతిభ
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా అండర్ 14 యోగా పోటీల్లో కుప్పం చిన్నారి తేజశ్రీ ప్రతిభ చాటింది. చిత్తూరు జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన తేజశ్రీ బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పాల్గొనగా చిత్తూరు జిల్లా తరపున తేజశ్రీ ప్రాతినిథ్యం వహించింది.