అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నరసింహులు, సాలమ్మ దంపతులు పని నిమిత్తం పని నిమిత్తం గుత్తికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా కర్నూలు వైపు నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ, నరసింహులు ను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.