పేద ప్రజలకు సేవలు చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉందని ఆర్డీటీ పరి రక్షణ జేఏసీ కన్వీనర్ సాకే హరి అన్నారు.ఆదివారం సాయంత్రం 4 గంటల సమయం లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందున్న పాధర్ విన్సెంట్ పెర్రర్ విగ్రహానికి ఆర్డీటీ పరి రక్షణ కమిటీ ఆధ్వర్యంలో పూల హారం వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయుకులు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కే వి రమణ,బహుజన సమాజ్ పార్టీ హరి ప్రసాద్.కుల వివక్షత పోరాట సమితి వెంకటేష్,సీపీఐ ఎం,ఎల్ లిబరేషన్ వేమన,ఎమ్మార్పిఎస్ కుంటి మద్ది ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.